టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలనా ఏం జరుగుతుందో క్షణాల్లోనే తెలుసుకునే సదుపాయం ఉంది. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు గూగుల్‌ను నమ్ముకుని తమకు కావాల్సిన అంశాలను సెర్చ్ చేస్తున్నారు. క్షణాల్లో తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇక తాజాగా నిర్వహించిన గూగుల్ సెర్చింగ్ సర్వేలో ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి.
సర్వే వివరాల ప్రకారం.. గూగుల్‌లో రకరకాల విషయాలపై సెర్చ్ చేస్తున్నట్లు సర్వే చెబుతోంది. ఇక కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు(married women) గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక మానదు. చాలామంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తన భర్తను ఏ విధంగా ఆకట్టుకోవాలి..? తన భర్త భార్య మాట వినాలంటే ఏం చేయాలి..? అనే విషయాలను వెతుకుతున్నారట. ఇవేకాదండోయ్.. అత్తగారిని సైతం ఎలా ఆకట్టుకోవాలి. తన వైపు ఎలా తిప్పుకోవాలి. అనే విషయాలపై గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేస్తున్నట్లు సర్వేలో తేలింది.
ఇంకో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే పిల్లలు పుట్టడానికి ఏ సమయంలో భార్యాభార్తలు కలవాలి.. అనే విషయాన్ని కూడా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారట. ఇలా ఈ ఏడాది కొత్తగా పెళ్ళైన మహిళలు రకరకాలు విషయాలపై గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారని సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతి చిన్న విషయాన్ని మైండ్ తో ఆలోచించకుండా.. ఫోన్లపై ఆధారపడి గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల , జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులంటున్నారు.
Do you want to know What exactly do married women search on Google? Then start read this article.