Eating plastic: ప్రతిరోజూ మీరు ఎంత ఆహారం తీసుకుంటారు? దీనికి సులభంగా సమాధానం చెబుతారు. అయితే మీరు రోజుకు ఎంత ప్లాస్టిక్ తింటారు అని అడిగితే మాత్రం మీరు సమాధానం చెప్పలేరు. ఒక నివేదిక ప్రకారం ఒక కప్పు పాలతో సలాడ్ తీసుకున్న వ్యక్తి 10 రోజుల్లో 7 గ్రాముల ప్లాస్టిక్ ని తింటున్నాడట.
గాలి, నీరు, ఆహారంతో పాటు ప్లాస్టిక్ (Eating Plastic) కూడా శరీరంలోకి చేరుతోందని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ఇంటర్నేషనల్ చేసిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ ఒక నెలలో మనం 4 x 2 సైజు లెగో బ్రిక్స్కు సమానమైన ప్లాస్టిక్ ని తింటాం. ఈ ప్లాస్టిక్ ఆహారంలో కలసి మన కడుపులోకి చేరి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.
ఈ అధ్యయనం ప్రకారం మనం ప్రతిరోజూ 0.7 గ్రాముల బరువుకు సమానమైన ప్లాస్టిక్ ని తింటున్నాం. న్యూస్ డాట్ ట్రస్ట్ ఓఆర్జీ నివేదిక ప్రకారం మనం ఒక సంవత్సరంలో.. అగ్నిమాపక దళంలో పనిచేసేవారి హెల్మెట్తో సమానమైన ప్లాస్టిక్ ని ఆరిగిస్తామట. అదే సమయంలో 10 సంవత్సరాలలో మనం సుమారు 2.5 కిలోల ప్లాస్టిక్ ని తింటాం. దీని ప్రకారం, మనం జీవితాంతం తినే ప్లాస్టిక్ గురించి ప్రస్తావించాల్సి వస్తే.. ఒక వ్యక్తి జీవితకాలంలో 20 కిలోల ప్లాస్టిక్ ని తింటాడట.