గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు చర్చలు, శాంతి సందేశాలు అంటూ కాలయాపన చేసేవారు. కానీ.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకపక్క
పాక్ వైపు సరిహద్దు చొరబాట్లు అరికడుతూ, అంతర్గతంగా ఉండే ఉగ్రవాదులను ఏరివేస్తూ దూకుడుగా ముందుకు వెళుతుంది.
ఇంకోపక్క చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణంలో ఢీ అంటే ఢీ అనే రీతిలో సత్తా చూపిస్తుంది. గతంలో గాల్వాన్ లోయలో దోంగదెబ్బ తీసి భారత సైనికులు మరణానికి కారణమైన చైనాకు యుద్ధరంగంలో ఆరితేరిన భారత సైనిక దళం తన పదునైన వ్యూహాలతో చుక్కలు చూపిస్తుంది. పాంగాంగ్ సరస్సు ఉత్తర రేవుని ఆక్రమించుకున్న చైనా వ్యూహానికి ప్రతివ్యూహం పన్ని భారత్ పాంగాంగ్
దక్షిణ రేవుని తన గుప్పిట చేజిక్కించుకుంది. ఈ చర్య వలన పాంగ్వాన్ సరస్సు పరిసర ప్రాంతాల్లో ప్రత్యర్థి సైనికుల కదలికలపై స్పష్టమైన నిఘా ఉంచే అవకాశం భారత్ చేతికి చిక్కింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యాన్ని అక్కడనుండి ఖాళీ చేయించడానికి చైనా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వారి కదలికలకు ధీటుగా భారత్ తన యుద్ధ ట్యాంకులను అక్కడ మోహరించింది. భారత్ చైనా యుద్ధ ట్యాంకులు అత్యంత సమీపంలో మోహరించి ఉండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు లైన్ అఫ్ యాక్షన్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ వెంబడి ఇరువైపులా లక్షమంది చొప్పున మోహరించి ఉన్నట్లు సమాచారం. తన దుందుడుకు వైఖరితో ఇంతవరకూ సరిహద్దుల్లో రెచ్చిపోతున్న చైనాకి చెక్ పెట్టే దిశగా భారత్ వ్యూహాలు రచిస్తోంది.