When Will there be Clarity on Telangana CM : తెలంగాణ రాష్ట్రం మొత్తం సీఎం ఎవరని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేక పోతుంది. ఇప్పటికే సీఎం రేసులో రేవంత్ రెడ్డి, బటీ విక్రమార్క ఉండగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు చేయవలసి వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అని ప్రజాభిప్రాయం.
ఆ పార్టీ నేతలు కూడా మెజారిటీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఉంటేనే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని, రాష్ట్ర ప్రజల నిర్ణయం కూడా అదే అని ఇప్పటివరకు సమాచారం. కానీ బట్టి విక్రమార్క లాంటి సీనియర్ నేతలు ఈ నిర్ణయం పై తమ అలకను ప్రదర్శించినట్లు తెలుస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో డికె శివకుమార్ ఢిల్లీకి బయలుదేరినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ నూతన సీఎం ఎవరనే దానిపైన రేపు స్పష్టత ఇస్తామని వార్తలు వెల్లడవుతున్నాయి. ఎంత ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న సీఎం అభ్యర్థి నిర్ణయం ఇంకా ఆలస్యం అవుతుంది.