Who is Telangana CM : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చాలా విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో చాలా సర్వేలు తమ తమ అభిప్రాయాలని వ్యక్తం చేసి, కాంగ్రెస్ కి ఎక్కువ శాతం ప్రజలు ఓట్లు వేశారని తెలిపాయి. కానీ ఈ నేపథ్యంలో ఇండియా టుడే చేసిన సర్వే ఇప్పుడు అంచనాలను తారు మారు చేస్తుంది.
మరోవైపు రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెబుతుంటే, ఇంకోవైపు డిసెంబర్ 4వ తారీఖున క్యాబినెట్ సమావేశం నిర్వహిద్దామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే హోరా, హోరీగా ఎవరి నిర్ణయాలను వారు మీడియా ముఖంగా తెలియజేస్తూనే ఉన్నారు. ఇంత సందిగ్దమైన పరిస్థితులలో ఇండియా టుడే చేసిన సర్వే ఇప్పుడు చాలా అనుమానాలకు దారి తీస్తుంది.

ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ నే ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎం అవుతారు అని ప్రజలలో పాకిపోయిన విషయం. కానీ ఇప్పుడు ఇండియా టుడే చేసిన సర్వేలో సీఎం ఎవరైతే బావుంటుందో అని అడిగిన ప్రశ్నకి 32 శాతం మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే బాగుంటుందని ప్రజలు కోరుకున్నట్టు తెలుస్తుంది.
అలాగే 21 శాతం మంది ప్రజలు రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని కోరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకో 21 శాతం ప్రజలు ఎవరైనా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారని ఆ సర్వే వెల్లడించింది. ఏది ఏమైనాప్పటికీ తెలంగాణ సీఎం ఎవరనేది తెలియాలంటే మనం డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే..
