Who is Telangana CM : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, మరోవైపు రాజ్ భవన్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రమాణస్వీకారం కోసం ఏర్పాటులను పూర్తి చేసినా కూడా, కాంగ్రెస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు అని విషయాన్ని నిర్ణయించలేకపోయింది.
దీని వెనకాల చాలా ట్వీస్ట్ ల మీద ట్వీస్ట్ లు జరుగుతున్నాయి. ఒకవైపు అందరూ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని మెజారిటీ అభిప్రాయం తెలుపగా, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ మాత్రం తాము కూడా పార్టీ సీనియర్లమని మా పేర్లను కూడా పరిశీలించాలని కోరారు.

నిన్న నిర్ణయం కొలిక్కి రాకపోవడంతో డి కె శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. తమ పేరు ఎందుకు పరిశీలనకు తీసుకోవట్లేదని వారు వాదిస్తున్నారు. ఈ రకంగా చూస్తుంటే సీఎం అభ్యర్థి ప్రకటన ఇంకా ఆలస్యం జరిగేలాగా ఉంది. మరోవైపు ప్రజలు పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరు కూడా సీఎం ఎవరు అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సీనియర్లను కాదంటే కాంగ్రెస్ కి పెద్ద చిక్కే వస్తుంది. అలాగని తెలంగాణలో పార్టీ పుంజుకోవడానికి ముఖ్య కారణం ఐకాన్ రేవంత్ రెడ్డి. తనను పక్కకు పెట్టిన పార్టీకి చిక్కే. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. బహుశా ఈ రోజు సాయంత్రానికి సీఎం అభ్యర్థి ప్రకటన జరిగే అవకాశాలు ఉన్నాయి.
