Who is the Chief Minister of Telangana from Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయాన్ని సాధించిన నేపథ్యంలో, హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా రేపు కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి స్థానాన్ని ప్రకటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తాజ్ కృష్ణకు చేరుకున్నారు. ఈరోజు రాత్రి సమావేశం నిర్వహించిన తదనంతరం ఈ సమావేశంలో ఏఐసిసి పరిశీలకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ తీసుకొని ఆ తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఒకవేళ ఈ ప్రక్రియ అటూ, ఇటూ అయినా సోమవారం ఉదయాన్నే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా డిజీపీ తో తన నివాసంలో రేవంత్ రెడ్డి తో సమావేశమయ్యారు. గవర్నర్ ను కలవనున్నట్లు, డీజీపీ కి రేవంతు తెలిపినట్లు సమాచారం అందుతుంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని రేవంత్ సూచించినట్లుగా ప్రత్యేక సమాచారం బయటకు వచ్చింది.

అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు విజయం సాధించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు అరవై స్థానాలు అవసరం ఉన్నాయి. పార్టీ గెలుపు పై ఇప్పటికే పలువురు నేతలు స్పందించారు. తమరిని గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హామీలను త్వరలోనే నెరవేరుస్తామని ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు.
