Who is the new President of Telangana Congress Party : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పేరు ఖరారు చేశారు. ఆయన ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవరు చేపడతారనే ఉత్కంఠ పార్టీ వర్గాలలో, ప్రజలను నెలకొంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరిస్తే ఉప ముఖ్యమంత్రిగా మళ్ళు భట్టి విక్రమార్క బాధ్యతలు తీసుకోరున్నారు. అయితే వీరితో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండ సురేఖ, దుదిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జీవన్ రెడ్డి తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరినే ఇంకా ఆ విషయం పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాని అధికారికంగా కూడా ఇంకా ప్రకటించలేదు. ఎక్కువ శాతం మాత్రము కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దామోదర్ రాజనర్సింహను నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు మాత్రం వస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దామోదర రాజనర్సింహ విజయం సాధించారు. దామోదర రాజనర్సింహ సామాజిక వర్గం వారు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఆ సామాజిక వర్గం అండదండలు ముందు, ముందు కాంగ్రెస్ కు ఉంటాయి అని , అధిష్టానం భావిస్తుంది.
