అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తర్వాత తమ ప్రచార కార్యక్రమాల్లో దూకుడుగా ముందడుగు వేస్తూ ప్రత్యర్థుల కంటే తన ప్రచారాన్ని వేగవంతం చేశారు.
అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీల మధ్య ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీనే విజయం సాధిస్తుందని, గెలుపు తమదేనని బలంగా నమ్ముతున్నానని, అమెరికాలో తాజా ఎన్నికలు కీలకమని డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరో నాలుగేళ్లు రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉండటం ఖాయమని అమెరికా ప్రజలకు అధికారం ఇచ్చే దిశగా పని చేస్తున్నామన్నారు. ప్రజల అండదండలతో ఇప్పటివరకు పార్టీ సజావుగా సాగిందని రిపబ్లికన్ పార్టీకి మునుముందు కూడా అధికారం ఇచ్చి దేశానికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. రిపబ్లికన్ పార్టీకి విజయం అందించాలని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ర్యాలీలో పాల్గొన్న ప్రజలు మరో నాలుగేళ్లు, మరో నాలుగేళ్లు అంటూ నినాదాలు చేశారు.