ఫిల్మ్ ఇండస్ట్రీ లో అందరూ మంచి, చెడు కలిసే పంచుకుంటారు. ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమం అయినా మరొకరు కుటుంబాలతో సహా వెళ్తారు. కానీ టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం ఎక్కడ ఎవరు చనిపోయిన కూడా చివరి చూపు చూడడానికి అస్సలు వెళ్లరు. చాల ఏళ్లుగా అయన ఇలాగే చేస్తున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం అందరు మాట్లాడుతున్నారు. మొన్న ఆ మధ్య కృష్ణగారు చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడంపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపించాయి.
ఆయన కుటుంబంలో మాత్రం అక్కినేని నాగేశ్వర రావు కన్ను మూసినా అయన సతీమణి అన్నపూర్ణమ్మ కన్ను మూసినప్పుడు అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. కానీ నాగార్జున ఎందుకు ఎవరు కన్ను మూసినా ఆఖరి చూపు కు వెళ్లడం లేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారింది. ఈఒక్క విషయం మినహాయిస్తే పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి, పార్టీలు ఉన్న కూడా నాగార్జున తప్పకుండా షూటింగ్ లేకపోతే హాజరు అవుతారు.
నాగార్జున ఎవరైనా చనిపోతే వెళ్ళింది అంటే, ఒక్క దాసరి ఇంటికి మాత్రమే. నాగార్జున సంగతి పక్కన పెడితే అయన కుమారులు నాగ చైతన్య మరియు అఖిల్ మాత్రం నాగార్జున వైఖరికి పూర్తి భిన్నం. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్ను మూస్తే చైతూ వెళ్లి ఆఖరి చూపు చూసి మహేష్ ని ఓదార్చాడు. అంతకు ముందు కూడా కొంతమంది సెలబ్రిటీస్ కన్ను మూస్తే చైతు పక్కాగా వెళ్లి పలకరించాడు.