Wi – Fi : ఈ రోజుల్లో అందరూ నెట్ లేకుండా ఫోన్ లేకుండా ఎటువంటి పనులు చేయలేకపోతున్నారు. అందరూ ఒకసారి ఇంట్లో వైఫై కనెక్షన్ పెట్టించుకుంటే దాంతో టీవీ, మొబైల్లో, లాప్టాప్ ఇలా ఇంట్లో ఉన్న అన్నిటికి వాడేసుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి వైఫై ని కొంతమంది నైట్ పూట ఆఫ్ చేయకుండా అలాగే వదిలేస్తారు. దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం..
పగలంతా వైఫై ని మన పనుల కోసం వాడుతూనే ఉంటాం. అయితే రాత్రిపూట కూడా చాలామంది వైఫై వాడుతుంటారు. ఆఫ్ చేయకుండా అలాగే పడుకుంటారు. దీనివల్ల ప్రమాదం ఉందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వైఫై రూటర్ రాత్రిపూట రన్ అవుతూనే ఉంటే దాని నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా మనకు చాలా రకాల వ్యాధులు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
ఇలా వైఫై ఆన్ లో ఉంటే శరీరానికి సంబంధించిన చర్మ సమస్యలు అనేక వ్యాధులు వస్తాయని చాలామందికి తెలియకపోవడంతో వైఫై ని ఆఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇంకా ముఖ్యంగా వైఫై ఆన్ లో ఉంటే రాత్రిపూట నిద్ర సమస్య ఎక్కువగా ఉంటుంది. నిద్రపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. వైఫై నుంచి వెలువడే రేడియేషన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా రాత్రి పడుకునే ముందు వైఫై రూటర్ నీ ఖచ్చితంగా ఆఫ్ చేయండి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడండి.