కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని నియమం అమల్లో ఉంది. అందరూ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళుతుంటే నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు కొంతమంది మాస్కు ధరించక పోవడం గమనార్హం.
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా రాజ్ కోట్ లో కారులో వెళుతుండగా మాస్కు ధరించ లేదని అడిగిన కానిస్టేబుల్ పై నడి రోడ్డులో వాగ్వివాదానికి దిగింది. తీవ్రస్థాయిలో విరుచుకు పడి దుర్భాషలాడింది. ఇది చూసిన సామాన్య పౌరులు ముక్కున వేలేసుకున్నారు. అక్కడే ఉన్న ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
