Women Health : 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడ, మగ తేడా లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలు మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి. 40 సంవత్సరాలు దాటిన ఆడవారిలో అయితే అనారోగ్య సమస్యలు రోజురోజుకీ ఎక్కువ అయిపోతాయి. ఆడవారిలో అనారోగ్య సమస్యలకు కారణం ఆ వయసులో వాళ్లు “మోనోపాజ్” దశలోకి వెళ్తారు.
ఈ దశలోకి వెళ్లడం అంటే హార్మోన్ల అసమతుల్యతలో మార్పు వస్తుందని అర్థం. ఈ దశలో ఒక్కో అనారోగ్య సమస్య శరీరంలోకి వచ్చి చేరుతూ ఉంటుంది. వచ్చే సమస్యలను ముందుగానే ఎలా గుర్తించాలో చూద్దాం. అలా గుర్తించడం వల్ల వాటి నుండి కాస్తయినా జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.
కిడ్నీ సమస్య..
ఈ సమస్య ఎక్కువగా మగవారిలో ఉంటుందని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఆడ, మగ తేడా లేకుండా కిడ్నీ సమస్య అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కిడ్నీలలో రాళ్లు రావడం మూత్రంలో మంట మూత్రంలో రక్తం పడడం, వెన్నులో విపరీతమైన నొప్పి లాంటివి ఈ సమస్య యొక్క తీవ్ర పరిణామాలు.
మధుమేహం..
40 సంవత్సరాలు పైబడిన ఆడవారిలో ఈ మధుమేహం ఎక్కువగా కనిపిస్తుంది. త్వరగా అలసిపోవడం, విపరీతమైన దాహం వేయడం, మూత్రానికి ఎక్కువగా వెళ్లడం, చూపు తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, చిగుళ్ల వ్యాధులు ఇవన్నీ కూడా మధుమేహం వచ్చే ముందు కనిపించే లక్షణాలు. వీటిని గమనించి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం నుండి కాస్త అయిన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆర్థరైటిస్..
40 సంవత్సరాలు దాటిన ఆడవారిలో కనిపించే ముఖ్యమైన సమస్య ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ రావడం వల్ల కీళ్లలో నొప్పి, కీళ్లలో బలం లేకపోవడం, మోకాళ్ళలో విపరీతమైన నొప్పి, ఎముకలు క్షీణించిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఊబకాయం..
మహిళలు ఈ ఊబకాయం సమస్య గురించి చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన మహిళల బాడీలో మార్పులు రావడం ఎంత సహజమో బరువులో కూడా తేడా వచ్చేస్తుంది. అధికంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలా కావడానికి కారణం “పెరిమోనోపాసిల్” హార్మోన్ల పనితీరు తగ్గడమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అందుకే 40 సంవత్సరాలు దాటిన మహిళలు బాడీ మాస్ ఇండెక్స్ పై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఇవన్నీ లక్షణాలతో పాటు జ్వరం, వాంతులు, మూత్ర దుర్వాసన, మూత్ర విసర్జన, సమయంలో మంటగా అనిపించడం వంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.