Women’s Day Special :మహిళా దినోత్సవ కానుకగా… శుభవార్త చెప్పిన ప్రభుత్వం
మహిళా దినోత్సవ సందర్బంగా మహిళలకి శుభవార్త అందించింది కేసీయార్ ప్రభుత్వం.
తాజాగా ఈరోజు తొర్రూరులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీయార్ మహిళలకి 2018-19,2019-20 ఆర్థిక సంవత్సరాలకి సంభందించి వడ్డీ లేని రుణాలని మంజూరు చేసినట్టు ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాలని మరింత ప్రోత్సహించేందుకు 750 కోట్లు వడ్డీలేని రుణాలు, అలాగే అభయ హస్తానికి సంభందించి 545 కోట్లని తక్షణమే విడుదల చేస్తున్నాం అని తెలిపారు.ఇవి రేపు మహిళా సంఘాల సభ్యులకు వారి అకౌంట్ ల లో జమ కానున్నాయి.