Womens T20 World Cup : సెమీస్ కి వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిందే..!!
దక్షిణాఫ్రికా లో జరుగుతున్న మహిళల ప్రపంచ్ కప్ లో భాగంగా నేడు భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. మొదటి రెండు మ్యాచ్ లు పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్ లతో గెలిచి.. ఆ తరువాత ఇంగ్లాండ్ తో ఓడిపోయిన భారత్.. సెమీస్ అవకాశలని కొంచెం కష్టం చేసుకుంది.
దీనితో ఈరోజు మ్యాచ్ చాలా కీలకం కానుంది ఇండియాకి. ఇక ఎవరి మీద ఆధారపడే అవకాశం రావొద్దు.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేదు అనుకుంటే గనుక ఈరోజు ఐర్లాండ్ తో జరగనున్న మ్యాచ్ లో గెలిస్తే చాలు.. సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. భారత్ ప్రస్తుతం 3 మ్యాచ్ ల్లో రెండు గెలిచి, ఒకటి ఓడి 4 పాయింట్లతో గ్రూప్ లో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి 6 పాయింట్లతో సెమీస్ కి వెళ్ళింది.
ఇవాళ ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడితే గనుక..ఆ తరువాత ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ నెగ్గితే.. ఇండియా టోర్నమెంట్ నుండి దాదాపుగా నిష్క్రమించే ప్రమాదం ఉంది. చూడాలి ఈ రోజు ఐర్లాండ్ పై మనోళ్లు ఏం చేస్తారు అనేది. అటు ఐర్లాండ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడింది. కాబట్టి చివరి మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
మ్యాచ్ ఈ సాయంత్రం 06:30 కి మొదలవుతుంది..!!