Women’s T20 World Cup: ICC Women’s టీ20 వరల్డ్ కప్ ను భారత జట్టు గ్రాండ్ గా ప్రారంభించింది. భారత్ ముందు పాక్ 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఈజీ విక్టరీ అందుకుంది టీం ఇండియా.
చిచ్చర పిడుగు జెమీమా రోడ్రిగ్స్ 38 బంతుల్లో 8 ఫోర్లతో 53 పరుగులతో రెచ్చిపోగా.. యంగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులతో భారత్ కు ఘన విజయాన్ని అందించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి అజేయంగా 58 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
మొదట బ్యాటింగ్ కి దిగిన పాక్ 20 ఓవర్లలో 149/4 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మారూఫ్ 68 నాటౌట్, అయేషా నసీమ్ 43 రాణించారు. భారత్ తన రెండో మ్యాచ్ ను వెస్టిండీస్ తో బుధవారం ఆడనుంది.
Also View : Anikha Surendran Hot LipKiss Scenes