WPL Cricket : ఇప్పుడైతే కొందరికి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అంటే.. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన్నా, షెఫలీ, రాధ, దీప్తి అని కొంతమంది పేర్లు తెలుసు కానీ.. రెండు దశాబ్దాల క్రితం క్రికెట్ ను ఆడపిల్లలకు నిషిద్ధం అయిన ఆటగా భావించారు. కాలం గిర్రున తిరిగింది చూస్తుండగానే మహిళలకు పురుషులతో సమాన వేతనాలు లభించాయి. ఉమెన్ క్రికెట్ లో కూడా అనేక లీగ్ లు నిర్వహించి..
ఆటను ప్రోత్సహిస్తూనే ఆదాయాన్ని పెంచుకున్నాయి క్రికెట్ బోర్డులు. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు క్రికెట్ కెరీర్ గా మారింది. తాజాగా మహిళ క్రికెట్ లో పెను మార్పు.. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే క్రికెట్ లవర్స్ ని అలరించగా నేటి నుంచి మరో కొత్త లీగ్ ఆకట్టుకోనుంది. పురుషుల తరహాలోనే ఉమెన్ క్రికెటర్స్ కి మహిళల ప్రీమియర్ లీగ్ ను నేటి నుంచి ప్రారంభించనున్నారు.
ఈ లీగ్ యంగ్ ఉమెన్ క్రికెటర్స్ కి సువర్ణావకాశం అనే చెప్పవచ్చు. ఐదు జట్లు.. ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, యూపీ వారియర్స్ పాల్గొనే ఈ లీగ్ లో 22 మ్యాచులు, 20 రోజుల పాటు జరగనున్నాయి. ఈ రోజు మొదటి మ్యాచ్ గుజరాత్ – ముంబై మధ్య జరగనుంది. అన్నీ మ్యాచులకు ముంబై వేదిక కానుండగా
తొలి సీజన్ కు క్రేజ్ పెంచేందుకు టికెట్ రేట్స్ 100 నుంచి 400రూ. గా నిర్ణయించారు. కొన్ని సీట్లను మహిళకు ఉచితంగానే కేటాయించారు. ఈ రోజు సాయంత్రం 5: 30 నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ టోర్నీ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ హీరోయిన్స్ కియార అద్వానీ, కృతి సనన్ హాజరు కానుండగా.. మ్యాచ్ 7:30 కి ప్రారంభం అవుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ అభిమానులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.