Yadadri Bhongir News:విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసు.. నేడు స్కూల్ ని సందర్శించనున్న జిల్లా విద్యాశాఖ అధికారులు
యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక ప్రయివేట్ పాఠశాల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ని నేడు జిల్లా విద్యాశాఖ, బాలల సంరక్షణ అధికారులు పర్యవేక్షించునున్నారు.రెండ్రోజుల క్రితం పదో తరగతి విద్యార్థిని పట్ల పాఠశాల కరస్పాండెంట్ అసభ్యంగా ప్రవర్తించడంతో,కరస్పాండెంట్ తో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జిల్లా అధికారులతో పాటు బాలల సంరక్షణ అధికారులు పాఠశాలలోని విద్యార్థులకి ఉన్న భయాలని తొలగించి, వారి నుండి పాఠశాల కి సంబందించిన పూర్తి సమాచారం,వసతుల పరిశీలనతో పాటు టీచర్లు స్పెషల్ క్లాస్ ల పేరిట తమతో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలుసుకోవాలని నేడు పాఠశాలని సదర్శిస్తున్నట్టు సమాచారం.సందర్శన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు టీచర్లతో కూడా ప్రత్యేక సమావేశం ఉంటుందని జిల్లా అధికారులు తెలిపారు.