Yadadri Brahmostavaalu:నేడు యాదాద్రికి నలుగురు మంత్రులు
తెలంగాణా తిరుపతి యాదాద్రికి ఈరోజు పలువురు మంత్రులు రానున్నారు. యాదాద్రి ఆలయం పునర్నిర్మానం తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ప్రభుత్వం కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు కనీవిని ఎరుగని రీతిలో బ్రహ్మాండంగా చేసింది. భక్తులకు కనీస అవసరాలు తాగునీరు, వసతి గదుల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.

అలాగే ఈరోజు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గుత్తా ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వస్తున్నట్లు… అలాగే ఏర్పాట్లు పర్యవేక్షించి, లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు.
