Yadadri Brahmotsavalu : ఈసారి అంగరంగ వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు… ఏర్పాట్లు పూర్తి..!!
తెలంగాణా తిరుపతి గా పేరు గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుండి ప్రారంభం కాబోతున్నాయి.
ఇందుకు సంభందించిన ఏర్పాట్లు అన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయని.. పైగా ఆలయ పునర్నిర్మాణం తరువాత మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ బతహ్మోత్సవాలు అంత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
దాదాపు ఆరేళ్ళ తరువాత నూతన ఆలయం లో మొదటిసారిగా …11 రోజులు పాటు జరిగే ఈ వేడుకలకి ప్రభుత్వం 1.50 కోట్లు కేటాయించిందని ముఖ్యం గా ఈ ఫిబ్రవరి 27న స్వామివారి ఎదుర్కోలు, 28 న కళ్యాణ మహోత్సవం, అలాగే మార్చి 1న రధోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
బ్రహ్మోత్సవాలకి రాష్ట్రం నలుమూలల నుండి అధికంగా భక్తులు వచ్చే విషయం దృష్టిలో పెట్టుకొని.. అందుకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా… భక్తులు అందరికీ సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు..