YADADRI LAKSHMI NARASIMHA :యాదాద్రి బ్రహ్మోత్సవాలకి నేడు హాజరుకానున్న గవర్నర్
తెలంగాణా తిరుపతి గా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల లో భాగంగా ఆలయ పునర్నిర్మాణం తరువాత జరుగుతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు కావడం తో అటు ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తులకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా స్వామివారిని దర్శించుకనే సౌకర్యం కల్పిస్తుంది. మంచినీరు, వసతి ఏర్పాట్లలో కూడా లోటు లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.హైదరాబాద్ చుట్టుపక్కల అనే కాకుండా రాష్ట్రం నలువైపులా భక్తులు వస్తుండడం తో యాదాద్రి తిరువీధులు జనసంద్రం తో నిండిపోయింది
ఈ రోజు బ్రహ్మోత్సవాల వేడుకకి అలాగే, నరసింహ స్వామి వారి దర్శనానికి నేడు తెలంగాణా గవర్నర్ కనిమొళి సౌందర రాజన్ హాజరుకానున్నారు. ఈ ఉదయం 08:45 కి యాదాద్రి కొండపైకి చేరుకుంటారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.ఆ తరువాత 9 గంటలకి బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.అనంతరం తిరిగి 10:45కి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.