మూడేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గవర్నమెంట్ ఉపాధ్యాయులకి తీపికబురులాంటి బిల్లుపై శనివారం ఏపి సిఎం జగన్ సంతకం పెట్టారు. 29 ఫిబ్రవరి 2020 నాటికి మూడేళ్ళు పూర్తి అయిన ఉపాధ్యాయులు అందరూ బదిలీలకి అర్హులే అని గవర్నమెంట్ ప్రకటించింది.
ఈ బదిలీలకి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ వివరాలు త్వరలోనే వివరించనున్నట్టు గవర్నమెంట్ ప్రకటించింది. అయితే మూడేళ్లుగా బదిలీలు కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు అందురూ సిఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులు సిఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేసినట్టు సమాచారం.
