2019 ఎలక్షన్ ముందు జనసేన తరుపున టివి చర్చల్లో పాల్గొంటూ బాగా పాపులర్ అయిన అద్దేపల్లి శ్రీధర్, ఆ ఎలక్షన్ లో జనసేన ఓటమి తరవాత కొన్ని రోజులు సైలెంట్ అయ్యి తరవాత వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే జనసేనలో జాయిన్ అవ్వకముందు బిజేపి తరుపున రాజమండ్రిలో యాక్టివ్ గా ఉండేవారు, బిజేపి లో ఉన్నటైంలో ఈయన పేరు రాజమండ్రిలోనే సరిగా ఎవరికి తెలీదు అనుకోండి అది వేరే విషయం.
అయితే ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ వైసిపి తరుపున ఒక టివి ఛానల్ చర్చలో పాల్గొన్నారు, ఆ చర్చలో జనసేన నుండి పోతిన మహేష్ మరియు కాంగ్రెస్ నుండి సుంకర పద్మ కూడా పాల్గొన్నారు.
అమరావతి గురించి చర్చమొదలైన కాసేపటికి సుంకర పద్మశ్రీ మాటలపై అసహనంకి గురైన అద్దేపల్లి అదుపుతప్పి సుంకర పద్మపై మాట తూలారు. జనసేన టిడిపి ప్రతినిధులు చాలాచక్కగా ఆచుతూచి మాట్లాడుతుంటే అద్దేపల్లి మాత్రం ఓ రేంజ్ లో పైర్ అయిపోయారు.
“పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను విజయవాడ వచ్చి తన్నతాను” అంటూ కాంగ్రెస్ ప్రతినిధి సుంకర పద్మ మీద ఒక రేంజ్ లో ఫైర్ అయిపోయారు అద్దేపల్లి.
ఫైర్ అయితే అయిపోయారు కానీ ఇంతకీ తను ఒక మహిళ మీద అలా మాట్లాడుతున్నాను అనే స్ప్రహలో లేకుండా అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు.
అయితే జనసేన లో ఉన్నన్నాళ్లు అద్దేపల్లి ఏరోజు ఎవరిమీద ఎలాంటి మాట తూలలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యారో చాలామందికి అర్థం కాని ప్రశ్నగా తయారయింది.
ఇప్పుడు ఇవే వ్యాక్యలపై సోషల్ మీడియాలో చాలామంది అద్దేపల్లి పై విరుచుకుపడుతున్నారు.
చూడాలి ఈ తుఫాన్ ఇంకెంత దూరం వెళుతుందో….