ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్ దేశంలోనే భిన్నమైన విధానాలతో దూసుకుని పోతున్నారు.పగ్గాలు చేపట్టిన కొత్తలోనే శాంతి భద్రతలుపై కఠినమైన నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలు పొందిన యోగి ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో మరోసారి ప్రజల మన్ననలు పొందారు.
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎవరైనా ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదవాలని లేకపోతే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు విషయంలో కోత విధిస్తామని హెచ్చరించారు.విద్యార్థులకి మెరుగైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని అది ఉద్యోగుల పిల్లల చేరికతో ప్రతి ఒక్కరి దృష్టి ప్రభుత్వ పాఠశాలపై ఉండాలని ఆయన ఉద్యోగులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుందని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను కేటాయించిందని తెలియజేసారు. యోగి నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
