అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ సరిగా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసం, చీప్ లిక్కర్ కోసం ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారంటూ.. లిక్కర్ కోసం ఓటు హక్కు అమ్ముకునే వాళ్లకి అసలు ఓటు హక్కు అనేది లేకుండా చేయాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ధనికుల కంటే మిడిల్ క్లాసు వాళ్లే ఇలా ఉన్నారంటూ, ఒక విమానం ఎక్కినపుడు ప్రయాణికులు అందులో ఉన్న పైలెట్ ను ఓటు వేసి ఎన్నుకోరు కదా అలాగే రాజకీయాన్ని కూడా పూర్తి అవగాహన ఉన్న వాళ్లనే పెట్టాలి. అంతేగాని అందరికీ ఓటు హక్కు కల్పించకూడదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ఓపిక నాకు లేదంటూ దేశానికి నియంతృత్వమే కరెక్ట్ అని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.