విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ముందుగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎండనక, వాననక రేయింబవళ్ళు కష్టపడుతూ.. విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు.
మారుతున్న టెక్నాలజీ విసిరే సవాళ్ళు, కోవిడ్ వంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చే హెల్త్ ఎమర్జెన్సీ లు, ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడం, ఇలా ప్రతి దశలోనూ ప్రతినిత్యం వారి సేవలు మరువలేనివని అన్నారు.
పోలీసు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారిపై పని ఒత్తిడి తగ్గించే విధంగా సంవత్సరానికి 6500 ఉద్యోగాల కల్పన ద్వారా నాలుగేళ్లపాటు పోలీస్ శాఖలో ఉన్న సిబ్బంది లోటుని భర్తీ చేయనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సంవత్సరం డిసెంబర్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయమని రాష్ట్ర డీజీపీ ని ఆదేశించామని తెలిపారు.
నిరంతరం ప్రజా రక్షణ లో ఉండే పోలీసులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని
భరోసా ఇచ్చారు.