ఏపీ ముఖ్యమంత్రి తనదైన శైలిలో సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా నైపుణ్యం కలిగి వెనకబడిన చేతివృత్తుల వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు.
రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆర్థిక అభివృద్ధి వైపు నడిపించే దిశగా అక్టోబర్ 2వ తేదీన E కామర్స్ సంస్థలు, ఫ్లిప్ కార్ట్ అమెజాన్ లతో ఒప్పందం దాదాపు 104 ఆప్కో వస్త్రాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఈ-మార్కెటింగ్ వ్యవస్థను ప్రారంభించబోతున్నారు.
ఇప్పటికే ఆప్కో ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్తులు దుప్పట్లు అందిస్తుంది. ఇప్పుడు తీసుకుంటున్న చర్యల ద్వారా చేనేత పరిశ్రమలు, కార్మికులు ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వమే సర్టిఫికేషన్ మార్కెటింగ్ బ్రాండింగ్ కల్పించడం ఈ పథకం కింద చేయనుంది.
