YS Viveka Murder Case:వివేకా హత్యకేసులో సంచలన విషయాలు వెల్లడించిన CBI.. అవినాష్ రెడ్డికి బిగస్తున్న ఉచ్చు
సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న అయిన YS వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుంది. వివేకా హత్య కేసు తెలంగాణా సీబీఐ దర్యాప్తు తో రోజుకో మలుపుతిరుగుతుంది. గతంలో “ఏపీ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోంది.. ఇందులో ఎన్నో అనుమానాలు ఉన్నాయ్, కేసు లో పక్షపాతం లేకుండా నిజాయతీ గా వాస్తవాలు తెలియాలి” అని వివేకా కూతురు, ఈ కేసుని తెలంగాణా సిబిఐ కి సుప్రీం కోర్ట్ ద్వారా బదిలీ చేయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంతటి పెద్దవారు ఉన్నా సరే శిక్ష పడాల్సిందే, కేసు కూడా త్వరగా పూర్తి చేయాలని సునీత విజ్ఞప్తి చేస్తూ వస్తుంది.

అయితే తాజాగా తెలంగాణా సీబీఐ మొదలుపెట్టిన వివేకా కేసు దర్యాప్తుతో వేగం పుంజుకోవడం తో పాటు సంచలనాలు భయటికి వస్తున్నాయ్ . నిందితుల నుండి వాంగ్మూలం కూడా మరోసారి తీసుకుని విచారణ చేస్తున్న సిబిఐ పలు సంచలన విషయాలు బయటపెట్టడం ప్రకంపనలు రేపుతుంది.”కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి బదులు తనకి ఇవ్వాలని వివేకా కోరారు. అలా కాకపొతే టికెట్ విజయమ్మ కి లేదా షర్మిలకి ఇవ్వాలని పట్టుబట్టారు.ఇది అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి నచ్చలేదు. దీనితో నిందితులతో కలిసి వివేకా హత్యకి కుట్రకి పన్నినట్లు తెలుస్తోంది.అయితే గుండెపోటు అనేది కధలో భాగంగా అల్లినట్టు అర్ధం అవుతుంది” అని CBI పేర్కొంది.
ఏదేమైనా వివేకా హత్య కేసులో ఎవరెవరు ఉన్నారు, హత్యకి కారణాలు ఏంటి అని ఇప్పటికైనా తెలంగాణా సీబీఐ ఈ కేసు త్వరగా ముగింపు దశకి తీసుకువస్తుందని తెలుగు ప్రజలతో పాటు వివేకా సభ్యులు భావిస్తున్నారు.
