Ys Viveka Murder Case:ఎంపీ అవినాష్ అరెస్ట్ తప్పదా.. Ys వివేకా హత్య కేసులో కొనసాగుతున్న CBI విచారణ
సంచలనం రేపిన Ys వివేకా హత్య కేసుకు సంభందించి, కడప ఎంపీ Ys అవినాష్ రెడ్డి CBI విచారణ కొనసాగుతుంది.
అయితే అవినాష్ ని ఈరోజు విచారించి సాయంత్రం వదిలిపెడతారా లేక అరెస్ట్ చేస్తారా అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా నిన్న అవినాష్, తనని CBI అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరడం చూస్తుంటే అరెస్ట్ తప్పదనే అనుమానాలు లేకపోలేదు.సాయంత్రం వరకు అయితే కానీ ఈ విచారణ పట్ల ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుత అవినాష్ విచారణ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది.
అటు Ys వివేకా కూతురు సునీత కూడా అవినాష్ వేసిన పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినాష్ వేసిన పిటిషన్ లో తన వ్యక్తిగత సమాచారం గురించి ప్రస్థావించారు అని, కేసుని తప్పుదోవ పట్టించేలా పిటిషన్ లో పేర్కొన్నారు అని సునీత తెలిపారు.అయితే అవినాష్ వేసిన ఈ పిటిషన్ లంచ్ తరువాత న్యాయమూర్తి టేబుల్ పైకి రానుంది. అవినాష్ చెప్పినట్టు కోర్ట్ ఆయన అభ్యర్థనని మన్నిస్తుందా లేక CBI కోరిక ప్రకారం వారికి అనుకూలంగా వ్యహరిస్తుందా అనేది చూడాలి మరి