Ys Viveka Murder Case :Ys వివేకా హత్య కేసులో కీలక మలుపు…అవసరం అయితే Ys అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామన్న CBI
Ys వివేకా హత్య కేసు విచారణలో భాగంగా అవసరం అయితే కడప ఎంపీ Ys అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని హై కోర్ట్ కి CBI తెలిపింది.వివేకా హత్య కేసుకు సంబందించి ధర్యాప్తులో భాగంగా, అవినాష్ రెడ్డి విచారణకి సంబందించిన ఆడియో, వీడియో రికార్థుల హార్డ్ డిస్క్ లు కోర్ట్ కి ఇచ్చేందుకు CBI సుముఖత వ్యక్తం చేయగా, సోమవారం అందించాలని హైకోర్టు తెలిపింది.
అయితే Ys వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సాక్షా? నిందితుడా? అని హైకోర్టు CBI ని ప్రశ్నించింది.అయితే CBI స్పందిస్తూ టెక్నికల్ గా ఆయన సాక్షి అని కోర్ట్ కి తెలిపింది.అవసరం అనుకుంటే అరెస్ట్ కూడా చేస్తామని CBI తెలుపగా,అందుకు హైకోర్ట్ స్పందిస్తూ సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని, అవసరం అయితే అవినాష్ మంగళవారం CBI విచారణకి హాజరు అవుతారని తెలిపింది.