Yuvagalam Closing Meeting : ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యచరణతో ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాయి. ఆ కోణంలోనే భారీగా బహిరంగ సభలు నిర్వహించాలని కీలక నిర్ణయం కూడా తీసుకున్నాయి. దీనిలో భాగంగానే మొదటిగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో మొదలు పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నారు.
వాస్తవంగా ఈనెల 17వ తేదీనే యువగళం పాదయాత్ర ముగింపు సభ జరగాల్సి ఉంది. కానీ తుఫాను కారణంగా ఆ పాదయాత్రను లోకేష్ మధ్యలోనే నిలిపివేశారు. మూడు రోజుల విరామం తీసుకున్న తర్వాత ఈనెల 20వ తేదీన ఈ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి కావలసిన ముందస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
అయితే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని మొదటనుంచి కొన్ని ఊహాగానాలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ కి ముందు నుంచే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో ఈ సభకు పవన్ హాజరు అవ్వట్లేదని తాజాగా తెలుస్తున్న సమాచారం. అయితే ఒకందుకు ఇది నారా లోకేష్ కి మంచి జరిగిందని టిడిపి వర్గాలు ఆలోచిస్తున్నాయి. పవన్ రాకపోవడమే మంచిదని వాళ్ళు అనుకున్నట్టు తెలుస్తుంది.
ఎందుకంటే టిడిపి నుంచి నారా లోకేష్ ని హైలెట్ చేయాలని టిడిపి పార్టీ భావిస్తుంది. ఒకవేళ ఆ సభకి హాజరైతే అందరి దృష్టి పవన్ వైపే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ముగింపు సభకు హాజరు కాకపోవడమే మంచిదని టిడిపి వర్గాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.
యువగళం ముగింపు సభ తర్వాత సభ నియోజకవర్గాల వారీగా టిడిపి, జనసేన లు కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు నడిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వరుసగా జరగబోయే సభలకు, సమావేశాలకి పవన్, చంద్రబాబు కలిసి హాజరవుతారని తెలుస్తుంది. ఇక వైసిపి ప్రభుత్వంను పూర్తిస్థాయిలో టార్గెట్ చేసుకుని ఎన్నికలే లక్ష్యంగా పవన్, చంద్రబాబు ఎన్నికల ముగిసే వరకు జనాల్లోనే ఉంటారని టిడిపి నుండి కీలక సమాచారం బయటికి వస్తుంది.