Cool Drinks : కూల్ డ్రింక్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూల్ డ్రింక్స్ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. చాలామంది ఫంక్షన్ లల్లో, పెళ్లిళ్లలో, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఈ కూల్ డ్రింక్ ని ఇస్తూ ఉంటారు. ఈ కూల్ డ్రింక్ లేనిది ఏ పార్టీ,ఫంక్షన్ కూడా నడవదు.
ఇంకా ఎండాకాలం లో అయితే వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ శీతల పానీయాలను వేసవిలో ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. మంచినీళ్లు ఎన్ని తాగినప్పటికి దాహం తీరదు, అలాంటప్పుడు ఎండ తాపానికి తట్టుకోలేక వీటిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ కూల్ డ్రింక్స్ బాటిల్లను ఎప్పుడైనా మీరు గమనించారా. బాటిల్లో నిండుగా ఎప్పుడూ కూడా డ్రింక్ నింపి ఉండదు. దాని వెనక కారణం ఏమిటి అనేది మీరు ఆలోచించారా.
కూల్ డ్రింక్ బాటిల్ మూతవరకు నింపి ఉండదు. దాని వెనక ఉన్న అసలు కారణం.. ఈ కార్బోరేటర్ వాటర్ ను కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ తో మిక్స్ చేయడం వల్ల ఆ గ్యాస్ అనేది బాటిల్లో పట్టడానికి ఫ్లేవర్డ్ లింకులు కాస్త తగ్గించి బాటిల్లో పోస్తూ ఉంటారు. అలా కాకుండా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కోసం ఎలాంటి ఖాళీ లేకుండా నిండుగా డ్రింకును నింపేస్తే మాత్రం ఆ బాటిల్ పగిలిపోయే ప్రమాదం ఉంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కాళీ లేకుంటే బాటిల్ పగిలిపోతుంది. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి నింపుతారు.