4 Rajayoga in December : కాలానికి అనుగుణంగా గ్రహాలు మరొక రాశిలోకి మారడం జరుగుతుంది. ఇలా మారడం వల్ల శుభ,అశుభాల యోగాలు కూడా మార్పు చెందుతాయి. ఈ క్రమంలో రాశులందరి జీవితాల్లో కూడా మార్పులు సంభవిస్తాయి. డిసెంబర్ 16న సూర్యగ్రహణం ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే బుద్ధుడు ఇప్పటికే ధనస్సురాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ధనస్సురాశిలో సూర్యుడు అలాగే బుధుడు కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుందని నిపుణులు వెల్లడించారు. సూర్యుని యొక్క ఈ రాశి మార్పు వల్ల మేషరాశిలో బృహస్పతి యొక్క తొమ్మిదవ స్థానం అంశం సూర్యునిపై పడిపోతుంది.
ఇది రాజలగ్న రాజయోగాన్ని ఏర్పరుస్తుందని, అదేవిధంగా కుజుడు తన సొంత రాశిలోకి ప్రవేశించి శుభయోగాన్ని కూడా ఏర్పరుస్తుందని, అలాగే శుక్రుడు తన సొంత తులరాశిలో మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తాడని కూడా నిపుణులు వెల్లడించారు. 500 సంవత్సరాల తర్వాత నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయని, కొన్ని రాశుల వారికి మంచి కాలం మొదలవుతుందని వెల్లడించారు. ఆ రాశుల వారెవరు ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశి
ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నాలుగు రాజయోగాలు సంపదను పెంచుతాయని తెలుస్తుంది. అదేవిధంగా సూర్యుని ఆశీస్సులతో ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది. మేషరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వ్యాపారంలో మంచి పురోగతిని కూడా పొందానున్నారు. వీరి చిరకాల కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత చదువులో సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఆదాయం పెరగడంతో పాటు, అవివాహిత మేషరాశి వారికి జీవిత భాగస్వామి కూడా లభించనుంది.
సింహ రాశి
ఇక సింహరాశి వారికి ఈ నాలుగు రాజయోగాల వల్ల సమాజంలో మంచి గౌరవ, ప్రతిష్టలు దక్కడంతో పాటు ఉద్యోగులు కార్యాలయంలో మంచి పురోగతిని పొందుతారు. ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు మంచి లాభాలను కూడా పొందనున్నారు.
తులారాశి
ఇక తులారాశి విషయానికొస్తే ఈ నాలుగు రాజయోగాలతో వీళ్ళకి శుభ రుతువు మొదలవుతుందని చెప్పవచ్చు. అది కూడా ఉద్యోగుల్లో పనిచేసేవారు మంచి ఫలితాలను పొందుతారు. వృత్తిపరంగా ఉన్నవాళ్లు వారి వృత్తులు అభివృద్ధి చెందుతారు. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితులలో ఊహించని మెరుగుదల కనిపిస్తుంది. అదే విధంగా అవివాహకులకు మంచి వార్త కూడా వింటారు. చాలా డబ్బు వీరు ఆదా చేసుకుంటారు.