7 Foods That Purify Blood : ప్రతి మనిషి శరీరంలో దాదాపుగా 5 లీటర్లకు పైగా రక్తం ఉంటుంది. మానవ శరీరంలో ఉన్న రక్తం కలుషితమైన, ఒకవేళ రక్తం శాతం తగ్గిన అనేక రకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులు తలెత్తుతాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కలుషితమైన ఆహారమే లభిస్తుంది. ముఖ్యంగా మన చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా కలుషితంగా మారిపోయింది. వాటితో పాటుగా నీరు, మనం తీసుకునే రోజువారి ఆహారం ప్రతి ఒక్కటి కలుషితమే.
దీని కారణంగా రక్తం ఇన్ఫెక్షన్ కి దారితీస్తుంది. ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. పోషకాలను చేరవేయడం, పోషకాహార లోపం లాంటివి వస్తాయి. జబ్బులు తొందరగా రావడానికి రక్తంలో వచ్చే ఇన్ఫెక్షన్ ఒక కారణం. అవయవాల పనితీరు దెబ్బతినడమే కాకుండా చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. రక్తాన్ని శుద్ధి చేసే కొన్ని ఆహార పదార్థాలు, పండ్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బీట్ రూట్
బీట్ రూట్ లో బీటాసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల రక్తం శుద్ధి చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ నీ రెండు గ్లాసుల నీటిలో ఏడు పది నిమిషాలు ఉడికించి, అందులో ఎండుమిర్చి, జీలకర్ర పొడి కలపాలి. దీని తర్వాత ఫిల్టర్ చేసి తాగితే రక్తం శుద్ధి అవుతుంది.
అల్లం, నిమ్మకాయ
అల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసి దాంట్లో కాస్త నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది.
తులసి
రక్తాన్ని శుద్ధి చేయడంలో తులసి ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. తులసి ఆకులు ఒక మంచి ఔషధంగా కూడా చెప్పవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే రక్తం శుద్ధి అయి ఆక్సిజన్ పరిమాణం కూడా పెరుగుతుంది.
వేప
వేప ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వేపాకులను నమిలి నీటిని తాగడం ఒక పద్ధతి అయితే, గ్రైండ్ చేసి జ్యూస్ లాగా తీసుకోని మరొక పద్ధతి. వేపాకులను నూరి చిన్న గోలీలు చేసి ఎండబెట్టి ఆ తర్వాత ప్రతి రోజు పరిగడుపున తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. వీటిల్లో ఉండే బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్ లను తొలగిస్తాయి.
వెల్లుల్లి
వెల్లుల్లి సీజనల్ వ్యాధి నుంచి మనల్ని కాపాడుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది
ఉసిరికాయ
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా మనకు లభిస్తుంది. దీన్ని జ్యూస్ గా కానీ పౌడర్ గా కానీ వాడుకోవచ్చు. రోగనిరోధక శక్తి బలపడమే కాకుండా రక్తం శుద్ధి అవుతుంది.
నిమ్మకాయ
ప్రతిరోజు ఖాళీ కడుపుతో గోరువెచ్చ నీటిలో నిమ్మకాయ రసాన్ని కలిపి తాగడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా పనిచేయడమే కాకుండా, బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే రక్తం శుద్ధి అవుతుంది.