Air Conditioner : ఎండాకాలం బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటిందంటే ఎవరూ కూడా బయటికి రాలేకపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక చాలామంది ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ ఏసీలు ఎక్కువగా వాడడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ ఏసీ వల్ల “సిక్ బిల్డింగ్ సిండ్రోమ్” అనే ఆరోగ్య సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారైనా సరే అతి చల్లదనంతో ఏసీలో ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పై ఏసీ వినియోగం చాలా దుష్ప్రభావమే చూపిస్తుంది. ముఖ్యంగా శ్వాసకోషాలలో మార్పులు చేరి ఆస్తమా లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సమయం ఏసీలోని చల్లదనంలో ఉండడం వల్ల బ్రాంచియల్ ఇన్ ఫ్లమేషన్ అనే సమస్యలు వస్తాయి. ఇది చాలా వ్యాధులకు మూల కారణం. ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల కళ్ళు తిరగడం, అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జలుబు, దగ్గులాంటి, ఫ్లూ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏసీ గాలిలో మాయిశ్చరైసర్ అనేది ఉండదు.
గాలిలో ఉన్న మాయిశ్చర్ ని ఎయిర్ కండిషనర్స్ పూర్తిగా పీల్చేస్తాయి. అందువల్ల ఏసీలో ఉన్నవారి శరీరంలో తేమ లేకుండా అవుతుంది. అది చాలా ప్రమాదం డిహైడ్రేషన్ కు దారి తీస్తుంది. కొన్నిసార్లు కిడ్నీలలో రాళ్లు ఏర్పడి, కిడ్నీలు దెబ్బ తినడం కూడా సంభవిస్తుంది. అలాగే హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఏసీ నుండి బయటికి వచ్చే చల్లటి గాలి మైక్రోబయల్ ఎలర్జీస్ కి నిలయంగా తయారవుతుంది. దానివల్ల ముక్కు, కళ్ళు, గొంతులో దురద రావడం, తుమ్ములు రావడం, తలనొప్పి, సైనస్ లాంటి సమస్యలు ఉత్పన్నమై విపరీతమైన ఒంటినొప్పులు వస్తాయి.