Banana Side Effects : అరటిపండు.. చిన్నపిల్లలనుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఇష్టంగా తినే పండు. మార్కెట్లో అతితక్కువ ధరకు లభించే పండుకూడా ఇదే. ఇందులో పొటాషియం, పీచు, ఆరోగ్యకర కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అరటి పండ్లను తీసుకుంటే.. గుండె జబ్బులతో పాటుగా పలు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం..
అరటి పండ్లు రోజుకి రెండు తింటే చాలు అంతకంటే ఎక్కువగా తింటే.. మలబద్ధకంతో పాటు కొన్ని ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి.
అరటిలో కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి. అలాగే దంత సమస్యలు కూడా వస్తాయి.
డయబెటిక్ బాధితుల అరటి పండ్లు తినొద్దు. ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
ఎక్కువగా అరటి పండ్లు తింటే.. త్వరగా బరువు పెరుగుతారు. వెంటవెంటనే.. అరటి పండ్లు తింటే నరాలకు హాని కలుగుతుంది.
కిడ్నీ బాధితులు అరటి పండ్లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
అరటి పండ్లలోని ఫైబర్ తో కొందరికి అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రోజుకి రెండుకి మించి అరటి పండ్లు తీసుకోవడం మంచిది కాదు.