Belly Fat : ఈ రోజుల్లో అమ్మాయిలైన లేక అబ్బాయిలైనా ఇబ్బంది పడే ప్రధాన సమస్య బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ రావడం వల్ల నలుగురులో తిరగాలన్న, మన ఒంటికి నప్పే బట్టలు వేసుకోవాలన్న ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. అసలు ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది. దానిని కరిగించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మనిషి ఉదయం లేవగానే వ్యాయామం అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయకపోవడం వల్ల ఫ్యాట్ వస్తుంది. అతిగా తినడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది. దీనితోపాటు చక్కెరను ఎక్కువగా తీసుకోవడం కూడా బెల్లీ ఫ్యాట్ కి కారణం. అందుకే ఈ ఫ్యాట్ తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.
ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఈ బెల్లీ ఫ్యాట్ కారణం అవుతుంది. కాబట్టి దీనిని తక్కువ అంచనా వేయకూడదు. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి మనం రోజువారి తీసుకునే ఆహారంలో మార్పులు చేయవలసి ఉంటుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాలు బెల్లి ప్యాట్ తగ్గడానికి సహాయపడతాయి. అవి ఏమిటంటే ఎండాకాలంలో పెరుగును తినడం వల్ల మన
ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డి ఎక్కువ మోతాదులో అందుతుంది. అలాగే పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది పెరుగు తినడం వల్ల ఫ్యాట్ తగ్గుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు సంపూర్ణ ఆరోగ్యానికి సూచికలు. గుడ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వాటితో పాటు అమేన్ ఆమ్లాలు కూడా
ఎక్కువగానే ఉంటాయి. ప్రోటీన్స్ గుడ్డులో మనకు ఎక్కువగా దొరుకుతుంది. గుడ్డు కొవ్వును కరిగించే వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. కాబట్టి ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం బెల్లీ ఫ్యాట్ కరగడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానిలలో ఉండే ఫైబర్ మన ఆకలి నియంత్రిస్తుంది. కాబట్టి పచ్చి బఠానీలను తినడం వల్ల బరువు తగ్గవచ్చు.
క్యారెట్లలో విటమిన్ ఏ, విటమిన్ సి ,విటమిన్ కె, బయోటిన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఆకుకూరలు కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి దోహదపడతాయి. ముఖ్యంగా బచ్చలకూరను ప్రతిరోజు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది.
.