Benefits of Applying Coconut Oil on the Face : చలికాలంలో శరీరం పగుళ్లు ఏర్పడుతుంది. పొడిగా మారుతుంది. దానికోసం అందరూ ఏవేవో క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటారు. కానీ సహజంగా కొంతమంది కొబ్బరి నూనెను అప్లై చేస్తారు. మరి చలికాలంలో కొబ్బరినూనెను అప్లై చేయడం మంచిదేనా.. కాదా.. తెలుసుకుందాం.. కొబ్బరి నూనె అనేది సహజ సిద్ధమైంది. దానిని ముఖానికి అప్లై చేయడం మంచిదే కానీ, అప్లై చేసే విధానం ఉంటుంది.
రాత్రి పూట ముఖానికి కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేస్తే, రాత్రంతా ముఖం తాజాగా, కోమలంగా తేమతో కూడుకొని ఉంటుంది. అలాగే ముఖం మీద మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది. పొడిచర్మం ఉన్నవారికి ఈ కొబ్బరినూనె చాలా మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి కృత్రిమ రసాయనాలు ఉండవు.
కాబట్టి దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు చాలా తక్కువ. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి వాటిని కూడా తగ్గిస్తుంది. అలాగే కళ్ళ కింద వాపులను, మచ్చలను, మొటిమలను తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. అతినీలలోహిత కిరణాలను తగ్గించే గుణాలు కొబ్బరి నూనెలో ఉంటాయి. అందువల్ల మంచి యాంటీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. దీన్ని సహజ మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మేకప్ ని తొలగించి చర్మాన్ని మాయిచ్చారైజ్ చేసే క్లెన్సర్‌గా కూడా కొబ్బరి నూనె పనిచేస్తుంది.