Benefits Of Bindi : మన సంస్కృతి, సంప్రదాయం ప్రకారం మనదేశంలో మహిళలు నుదుటిన బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ రోజులలో బొట్టు అనేది ఒక ఫ్యాషన్ గా కూడా మారిపోయింది.
బొట్టు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించబడిందని పండితులు కూడా చెబుతున్నారు. అయితే ఈ బొట్టు వల్ల కేవలం మహిళకే కాకుండా పురుషులకు కూడా ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

మహిళలు బొట్టు పెట్టుకునే రెండు కనుబొమ్మల మధ్యల ప్రదేశాన్ని “ఆజ్ఞా చక్రమని” అంటారు. దీనిని ఆరవ అత్యంత శక్తివంతమైన చక్రంగా చెప్పుకుంటారు. బొట్టు పెట్టుకునే సమయంలో నుదుటిని చాలాసార్లు నొక్కడం వల్ల ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు, చర్మానికి సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.
బొట్టు పెట్టుకునే సమయంలో తల మధ్యలో నుదుటి భాగాన్ని నొక్కుతూ ఉంటాం. అలా చేయడం వల్ల తల,కళ్ళు,మెదడు, ప్రేరేపితం చేస్తుంది. రోజుకు చాలాసార్లు బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ప్రెస్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి బొట్టు అనేది కేవలం మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుంది.
వారు బిందినీ ధరించకుండా కుంకుమను బొట్టుగా పెట్టుకుంటే వారికి కూడా దృష్టి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. డిప్రెషన్ నుంచి దూరం అవుతారు. తలనొప్పి తగ్గిపోతుంది. నాడులన్నీ చక్కగా పనిచేస్తాయి. వారు మానసికంగా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు.
