Black Tea : ఉదయం లేవగానే టీ తాగకపోతే చాలామందికి ఏమి తోచదు. అంతలా టీ కి అడిక్ట్ అయిపోయారు. అయితే ఈ టీలలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక రకమైన టీ ని ఆస్వాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్లాక్ టీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ టీ తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. అసలు ఆరోగ్యానికి బ్లాక్ టీ మంచిదేనా.. కాదా..?
సైంటిస్టులు అభిప్రాయం ప్రకారం బ్లాక్ టీ తాగడం వల్ల చాలా రకాల రోగాలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఈ బ్లాక్ టీలో పాలు, చక్కెరలాంటివి కలపకుండా కేవలం పొడి వేసి మరిగించుకొని తాగితే మంచిదంట. ఈ బ్లాక్ టీ తాగడం వల్ల స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు, అని పలు అధ్యయనాల్లో వెళ్లడైందని సైంటిస్టులు చెబుతున్నారు.
అయితే ఈ రోజులలో ఒత్తిడిని చాలామంది ఫేస్ చేస్తున్నారు. రక్తపోటు సమస్యను నియంత్రంలో ఉంచుకోవడానికి, చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచే ఈ బ్లాక్ టీ చాలా అవసరం. షుగర్ సమస్యలు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. క్యాన్సర్ ని నిరోధించి క్యాన్సర్ కారకాలను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా సీజనల్ గా వచ్చే అలర్జీలను కూడా ఈ బ్లాక్ అదుపులో ఉంచుతుంది. ఈ బ్లాక్ టీ బ్యాగ్స్ ఇప్పుడు చాలావరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంట్లో సహజ సిద్ధంగా చేసుకునే టీ అయితే మంచిది. బ్లాక్ టీ బ్యాక్స్ వేసుకున్న తర్వాత దానికి తోడు అల్లం లేద నిమ్మకాయ రసాన్ని కలిపి తాగితే ఇంకా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.