Bone Weakness in Women Over 30 : మహిళల్లో 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా ఎముకుల బలహీనతలు ఎముకల్లో ధృఢత్వం తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతాయి. మరి ఆ సమస్య నుండి బయట పడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎముకల్లో బలం ఎందుకు తగ్గుతుంది తెలుసుకుందాం..
ఐరన్ లోపం..
తీసుకునే ఆహారంలో సరైన ఐరన్ శాతం లేకపోతే దాని ఎఫెక్ట్ ఎముకల పైన పడుతుంది. ఐరన్ తీసుకుంటే ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో ప్రతిరోజు ఐరన్ తీసుకోవాలి.
విటమిన్ల లోపం ..
విటమిన్ లోపం వల్ల కూడా ఎముకల్లో దృఢత్వం తగ్గిపోతుంది. ముఖ్యంగా విటమిన్ సి, కె లోపం వల్ల ఎముకల్లో ఆరోగ్యం క్షిణిస్తుంది. ఎముకలకు సరైన మోతాదులో విటమిన్స్ శరీరానికి అందేలాగా చూసుకోవాలి.

సూర్యరశ్మి ..
శరీరానికి సూర్యరశ్మి చాలా అవసరం. విటమిన్ డి మనకు సూర్యరశ్మి నుంచి అందుతుంది. ప్రతిరోజు ఉదయం 8 లోపు సూర్యరశ్మి లో విటమిన్ డి మనకు లభిస్తుంది. అంతేకాకుండా దీనివల్ల చర్మంపై ఉండే స్వేద గ్రంధులు ఆక్టివేట్ అయి చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.
పండ్లు, కూరగాయలు ..
విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ లేదా నిమ్మ జాతికి చెందిన నారింజ, కమల, బత్తాయి లాంటివి తరచుగా తీసుకోవాలి. వీటితో పాటు డ్రాగన్ ఫ్రూట్స్, ఉసిరికాయలు, కివిలో కూడా విటమిన్ సి మెండుగా ఉంటుంది. అలాగే పాలకూర, క్యాబేజీ, క్యారెట్స్, బ్రోకలీ వంటి వాటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజువారి డైట్ లో భాగం చేసుకుంటే ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి.
