Brain Boosting Foods : ఉరుకుల, పరుగుల జీవితంలో ఎవరు ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధను చూపించారు. టైమ్ కి ఏది దొరికితే అది తినేస్తూ, తమ పనిని సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేడు చాలా మంది దీంట్లో జంక్ ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. అయితే దీనివల్ల మెదడు చురుకుదాం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. మరి మెదడు పనితీరు మెరుగవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్ట్రాబెర్రీస్ : స్ట్రాబెరీస్ లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఈ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా ఈ పనులలో ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది.
పసుపు : మెదడును చురుగ్గా ఉంచడంలో పసుపు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఆహారంలో రోజు పసుపును చేర్చడం చాలా మంచిది. పసుపులో ఉండే, కర్కుమిన్ అనే సమ్మేళనం సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కణాల అభివృద్ధికి కూడా పసుపు తోడ్పడుతుంది.
నట్స్ : బ్రెయిన్ ను హెల్తీగా ఉంచడంలో నట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా పిస్తా, వాల్ నట్స్, బాదం వంటివి ప్రతిరోజు తీసుకుంటే, అవి మెదడు ఆరోగ్యాన్ని పెంచి, ప్రోటీన్ ని ఇతర పోషకాలను కూడా మనకు అందిస్తాయి.
అవకాడో : అవకాడలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసీడ్స్ మరియు చాలా రకాల విటమిన్స్ బ్రెయిన్ ని చాలా షార్ప్ గా ఉంచడంలో సహాయం చేస్తాయి. అవకాడో తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి పెరగడమే కాకుండా, అల్జీమర్స్ వచ్చే రిస్కును కూడా తగ్గిస్తుంది. మెదడును మెరుపు వేగంగా పనిచేయడం చేయించడంలో అవకాడో చాలా ప్రధానంగా పనిచేస్తుంది.