Causes of Brain Stroke : మారుతున్న జీవనశైలిలో ఆహారంలో మార్పు వల్ల ఆ ప్రభావం మన శరీర అవయవాలపై పడుతుంది. అందువల్ల ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముఖ్యకారకాలు ఏమిటో తెలుసుకుందాం..
ఆహారపు అలవాట్లు : ఆహార అలవాట్లు ఆరోగ్యం పై అధిక ప్రభావాన్ని చూపుతుంటాయి. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారంలో సంతృప్త ట్రాన్స్ ఫ్యాట్ మొత్తం కొలెస్ట్రాలను పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా అధిక సోడియం ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకు ఊబకాయం, రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ కారణాలు ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రధాన కారణాలు అవుతాయి. అందువల్ల మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా పండ్లు, తృణధాన్యాలు కూరగాయలు ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
ధూమపానం : అదిక ధూమపానం చేస్తే రక్తనాళాలు ఇరుకై గట్టిపడతాయి. అలా కావడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మెయిన్ స్ట్రోక్ వస్తుంది. ధూమపానికి దూరంగా ఉండాడం చాలా ముఖ్యం.
శారీరక శ్రమ : శారీరక శ్రమ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దానికి విరుగుడు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. దానివల్ల స్ట్రోక్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
ఆల్కహాల్ : ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె కొట్టుకోవడం రక్తపోటు పెరుగుతుంది. ఆల్కహాల్ పూర్తిగా వదిలేస్తే ప్రమాదం తగ్గుతుంది. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే కాలేయం శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఆల్కహాల్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
తీవ్ర ఒత్తిడి, నిద్ర లేమీ : బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. అధిక ఒత్తిడి వ్యాధులకు కారణమవుతుంది. దీనివల్ల రక్తపోటు ఎక్కువగా పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలి.