Chai Biscuit : ఉదయం లేవగానే చాలామందికి ఒక కప్పు ఛాయ్ కడుపులో పడకపోతే ఆరోజు మొత్తం ఎదో పోగొట్టుకున్న వారిలా ఫీల్ అయిపోతారు.చాలామంది వారి దినచర్యలో మొదటి ప్రాధాన్యత ఛాయ్ కే ఇస్తారు. ఛాయ్ తాగడం వల్ల ఒక లాంటి హుషారు వచ్చి ఆరోజు మొత్తం వారి పనులన్నీ చాలా చురుగ్గా చేసేసుకుంటారు అని వారికొక విశ్వాసం.
కొంతమంది ఉదయాన్నే ఛాయ్ తాగకపోతే తలనొప్పి వస్తుందని కూడా ఫీలవుతూ ఉంటారు. అయితే చాలామంది ఛాయ్ తో పాటు బిస్కెట్ ని కూడా కలిపి తింటూ ఉంటారు. అలా తినడం ఎంతవరకు సమంజసం. ఛాయ్, బిస్కెట్ రెండు కలిపి తినడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయా.. అలా తినవచ్చా.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఛాయ్ తో పాటు బిస్కెట్ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాయ్, బిస్కెట్ కలిపి తినడం వల్ల అనేక రకాల వ్యాధులకు ఆహ్వానం పలికినట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాయ్, బిస్కెట్ కలిపి తింటే శరీరంలో షుగర్ స్థాయి పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎలాగంటే.. ఛాయ్ లో పంచదార ఉంటుంది అలాగే బిస్కెట్ లో కూడా చక్కెరను వాడుతారు.
ఈ రెండింటిని కలిపి తినడం వల్ల షుగర్ స్థాయి పెరుగుతుంది. అలాగే ఇన్సూలిన్ హార్మోన్స్ ఇన్ బాలన్స్ అవడం కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. వాటితో పాటు మలబద్దకం, డయాబెటిస్,హైపర్ టెన్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉందని వారు తెలుపుతున్నారు. ఛాయ్,బిస్కెట్ కలిపి తినడం వల్ల ముఖ్యంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఛాయ్,బిస్కెట్ కలిపి తినకపోవడమే మంచిది.