Chanakya Ethical Principles for Success : ఆచార్య చాణక్యుడు చాలా రకాల గ్రంథాలను రచించాడు. వాటిలో ప్రముఖమైనదిగా చాణక్య నీతిని చెప్పుకుంటారు. ప్రజల జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను చాణక్యుడు దాంట్లో పొందుపరిచాడు. అలాగే ఒక మనిషి మనుగడ సజావుగా సాగాలంటే కొన్ని సూత్రాలను అవలంబిస్తే విజయాన్ని అందుకొని, జీవితంలో సుఖంగా జీవించవచ్చు అనేది పొందుపరిచాడు.
అయితే చాణిక్యనీతిలో చాలా అంశాలు ప్రస్తావించినప్పటికీ ఒక మనిషి విజయాన్ని సాధించడానికి, కొన్ని విషయాలను అనుసరించాల్సిందే అని ప్రగాఢంగా తెలిపాడు. గొప్ప పనులు చేస్తే, ఇతరుల సంక్షేమం కోసం శ్రద్ధ వహిస్తే, విజయం సాధిస్తాడు. అనేది చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలలో ఒకటి. ఆచార్యుడు చెప్పిన నీతి సూత్రాల్లో ప్రముఖమైనది జ్ఞానం. జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్క మానవుడు అర్థం చేసుకోవాలి.

అదే విజయానికి కీలక మార్గం అవుతుంది. మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించగలుగుతాము. ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించడం కొరకు ఎల్లప్పుడూ తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలి. జ్ఞానం లేకపోతే విజయాన్ని సాధించలేం. కష్టపడి పని చేసే తత్వాన్ని కూడా అలవర్చుకోవాలి. అది కూడా జీవితంలో విజయానికి మెట్టు అవుతుంది.
ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి కృప కష్టపడి పని చేసే వారి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కష్టార్జితంతో విజయ గాధలు రాసిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే వ్యక్తి మంచి ప్రతిఫలాన్ని చూస్తాడు. పనిని వాయిదా వేయకూడదు. అలాగే ప్రసంగంలో మధురమైన మాటలు గల వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సులభంగా చేరుకోగలుగుతాడు.
గాత్ర మాధుర్యం ఉన్న వ్యక్తులు విజయం సాధించడానికి ముందు వరసలో ఉంటారు. ప్రజలు ఎప్పుడూ అనర్గళంగా మాట్లాడే వారిని,ఆత్మీయంగా మాట్లాడే వారిని ఇష్టపడుతూ ఉంటారు. అందుకే అందరితో ప్రేమగా మాట్లాడాలి. కోపం, అహంకారంతో కూడిన మాటలకు దూరంగా ఉండాలి.
