Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్లాలో తన అపార జ్ఞానం ద్వారా మనకు సూచించాడు.ప్రతి ఒక్కరి జీవితం ఎన్నో ఆటుపోట్లతో ముడిపడి ఉంటుంది. అలాంటి జీవితాన్ని ఎలా సవ్యంగా సాగేలా ,ముందుకు తీసుకు వెళ్లాలో,మనిషికి ధైర్యం ఎంత అవసరమో,విజయం కొరకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలో చాణక్యుడు వివరించాడు.
మనసుపై నియంత్రణ : మనిషి మనసు పరి,పరి విధాలా ఆలోచిస్తూ ఉంటుంది. మనసు మీద నియంత్రణ లేనివాడు జీవితంలో ఏదీ సాధించలేడు. ప్రతి మనిషి పుట్టుకతోనే దనవంతుడుగా పుట్టడు. జీవితంలో ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.మనసును నియంత్రణలో పెట్టుకుంటే మంచి విజయాలు పొందవచ్చు.

అసూయ : మన పక్కన వాళ్ళు ఎదుగుతుంటే అస్సలు తట్టుకోలేరు.. అసూయ పడుతుంటారు. అలా చేయడం సరైన పని కాదు. ఉన్నతమైన జీవితం కోసం కలలు కనాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి.అసూయ పెంచుకోవడం వల్ల అనర్దాలు తప్ప ప్రయోజనం ఉండదు.
మంచివారితో స్నేహం : ఆరు నెలలు ఎవరితో అయిన స్నేహం చేస్తే వారు వీరవుతారని ఒక సామెత ఉంది. మంచివారితో స్నేహం మనల్ని మంచి మార్గం వైపు తీసుకెళ్తుంది. వారితో స్నేహం చేసేందుకు ప్రయత్నించాలి. మనకు కూడా మంచి ఉద్దేశాలు,మంచి అలవాట్లు అలవడతాయి. ఈ అలవాట్లు మనం జీవితంలో ఎదిగేందుకు దోహదపడతాయి.
