Chanikyaniti about Women : చాణక్యుడు తను స్వయంగా రచించిన నీతి పుస్తకంలో సామాజిక సంక్షేమం,శ్రేయస్సు కొరకు పలు విధానాలను, నీతి సూక్తులను రచించాడు. వీటిని క్రమ పద్ధతిలో ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితాల్లో నుండి సమస్యలు దూరం అయి, జీవితం సుఖవంతంగా సాగుతుంది. చాణక్యుడి తెలివితేటలు ఆమోగం, అనీర్వచనీయాం, ఎందుకంటే ఆయన రచించిన నీతి బోధలు ఇప్పటి కాలానికి కూడా ఉపయోగ పడేలాగా ఉన్నాయి. ఆయన అంత దూరదృష్టి తో రచించాడు.
చాణక్యుడు అనేక పుస్తకాలను రచించాడు. ముఖ్యంగా చాణక్య రాజనీతి అద్భుతం. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో చాణక్యుడు కీలకపాత్ర పోషించాడు. చాణక్యుడు రచించిన పుస్తకాల్లో అనేక విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా ఎటువంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారో అనే విషయం కూడా ఆ పుస్తకంలో రచించాడు.

ప్రేమ, గౌరవ మర్యాదలు ఉండే స్త్రీ..
ఇంటి పెద్దలకు గౌరవాన్ని ఇచ్చి, చిన్నవారిని ప్రేమించే మనస్తత్వం ఉన్న స్త్రీ ఇంటిని సవ్యంగా నడపగలుగుతుంది. అలాంటి లక్షణాలు ఉన్న స్త్రీ దొరకడం ఆ ఇంటి వారికి చాలా అదృష్టం. ఈ స్త్రీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా చాలా సులువుగా చాకచక్యంగా పరిష్కరించగలుగుతుంది. ఇలాంటి స్త్రీ వల్ల ఎప్పుడు ఆ ఇల్లు సంతోషాలతో, సౌభాగ్యాలతో విలసిల్లుతుంది.
ఓపిక గల స్త్రీ..
సహనాన్ని పాటించే స్త్రీ, కష్టాలు ఎదురైనప్పుడే కాకుండా అన్నివేళలా ఓపికతో నడిస్తే ఆమె జీవితంలో ఎప్పుడు ఒడిదుడుకులు అనేవి ఉండవు. అలాంటివారు గెలుపు తోనే మొదటి స్థానంలో ఉంటారు. ఓటమి వాళ్ళ దరిచేరదు.ఇలాంటి స్త్రీ ని పెళ్లి చేసుకుంటే ఆ పురుషుడు విజయవంతంగా విజయం వైపు వెళ్తాడు అని చాణక్యుడు చెప్పాడు.
ప్రశాంతంగా ఉండే స్త్రీ..
మనిషికి ముఖ్యమైన శత్రువు కోపం. అధిక కోపం మనిషిని అదుపు తప్పేలాగా చేస్తుంది. ప్రశాంతంగా ఉండే వారి వల్ల కుటుంబము, ఇల్లు సరైన మార్గంలో నడుస్తుంది. అందుకే ప్రశాంతంగా ఉండే స్త్రీ ఇంటిని అన్ని విధాలా సంరక్షించగలుగుతుంది. అంతేకాదు ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ దైవం కొలువై ఉంటాడు. అలాంటి ఇళ్లల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు.

ఆప్యాయంగా మాట్లాడే స్త్రీ..
ఆప్యాయంగా, ప్రేమతో ,మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. ఆమె ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా ఆ వ్యక్తికీ మద్దతుగా నిలుస్తుంది. ఇలాంటి లక్షణాలున్న స్త్రీ. తమ కుటుంబ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది. ఆమె ఆనందంగా ఉండటమేకాక కుటుంబ సభ్యులందరినీ ఆనందంగా ఉంచుతుంది.
తన ధర్మాన్ని ఆచరించే స్త్రీ..
ఏ వ్యక్తి జీవితంలో అయినా ధర్మాన్ని ఆచరించడం చాలా ముఖ్యమైన స్వభావం. ఇలాంటి స్వభావం ఉన్న మహిళ భార్యాగా లభిస్తే భర్త తలరాత మారిపోతుంది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలు రోజు పూజలు చేసి దైవారాధనలో ఉంటారు. అలాంటి గృహాల్లో దైవం కొలువై ఉంటుంది. ఇలాంటి స్త్రీల వల్ల కుటుంబము నిత్యసంతోషాలతో, సౌభాగ్యాలతో విరాజిల్లుతుంది .
