Computers and Mobiles are Dangerous to Eyes : ఈ రోజులలో చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేస్తుంటారు. అలాగే మొబైల్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా రోజులో ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేయడం ద్వారా కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు నిపుణులు. ఆ ప్రమాదం నుంచి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ గాడ్జెట్స్ వాడినప్పుడు వాటి నుంచి వచ్చే వెలుతురు మన కళ్ళకు చాలా హాని చేస్తాయి. అందుకని ఆ లైటింగ్ కి దూరంగా ఉండడం మంచిది. ఇలాంటి సమయంలో పిల్లల్ని ఆ లైటింగ్ కి దూరంగా ఉంచాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే నేచురల్ లైట్ చాలా అవసరం. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం విటమిన్ ఏ ఎక్కువగా ఉండే గుడ్లు, క్యారెట్ తినాలి.
డిజిటల్ పరికరాల నుంచి వచ్చే లైట్ వల్ల కంటి కండరాలు దెబ్బ తినడమే కాకుండా చూపు మందగిస్తుంది. ఈ గాడ్జెట్స్ ఎక్కువగా వాడే వాళ్ళు ముఖ్యంగా 20 – 35 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్లయితే సంవత్సరానికి ఒకసారి అయినా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంప్యూటర్, మొబైల్ ఎక్కువగా వాడుతూ, సిగరెట్ తాగే
అలవాటు ఉన్న వాళ్లకు కంటి సమస్య ఇంకా తీవ్రంగా ఉంటుంది. వీలైనంత ఎక్కువగా మొబైల్ ని, కంప్యూటర్ ని అవాయిడ్ చేయడమే మంచిది. లేకపోతే భవిష్యత్తులో కంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది.