Cons of Drinking Water after Eating : నీళ్లు తాగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా నీళ్ళు తాగితే చాలా రకాల అనారోగ్య సమస్యలను తప్పించుకోవచ్చు. అంతేకాకుండా శరీరం ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. కానీ నీరు తాగే పద్ధతిని సక్రమంగా అమలు చేయాలి.
ఎప్పుడు పడితే అప్పుడు నీరు తాగితే మాత్రం మంచికి బదులుగా చెడు జరిగే అవకాశాలే ఎక్కువ. మరి సరైన పద్ధతిలో నీరు ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిరోజు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కనీసం లీటర్ పైన నీళ్లు తాగితే చాలా మంచిది. ఇంకా ఆస్థానంలో గోరువెచ్చని నీళ్లయితే మలబద్ధకం సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆ రోజంతా సక్రమంగా పనిచేస్తుంది.
చాలామంది తినగానే నీళ్లు తాగేస్తూ ఉంటారు. అలా తాగడం వల్ల జీర్ణరసాలు పల్చబడిపోయి, అజీర్తి, పొట్ట నిండుగా ఉండడం వంటి సమస్యలు వస్తాయి. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి, రక్త పోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. యూరిక్ ఆసిడ్ పెరిగిపోవడం లాంటివి కూడా జరుగుతాయి.
అందుకే ఆహారం తీసుకున్నాక అరగంటైనా ఓపిక పట్టాలి అంటున్నారు నిపుణులు. అరగంట తర్వాత నీళ్లు తాగాలి. ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగకపోవడమే మంచిది. అలాగే ఆహారం తీసుకునే రెండు గంటల ముందు కడుపునిండా నీళ్లు తాగితే తినేటప్పుడు దాహం వేయదు. నీళ్లు తాగే ఈ పద్ధతులను అవలంబిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.