Dangerous Food : పఫర్ ఫిష్ : ఫుగు (పఫర్ ఫిష్) అనేది ఒక విషపూరితమైన చేప. ఇది జపాన్ కి చెందినటువంటిది. ఈ చేపను వండేందుకుగాను చెఫ్ లకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఈ విషపూరితమైన చేపను వండడంలో విఫలమైతే మనుషుల ప్రాణానికి ప్రమాదం కాబట్టి. ఈ చేపను వన్డే చెఫ్ కి ఈ వంటకం చేయడంలో ఏదైనా తప్పు దొర్లితే అతనికి లైసెన్స్ లభించదు.
క్లామ్స్ : చైనాలో లభించేటటువంటి బ్లడ్ క్లామ్స్ సాధారణంగా అందరు తింటారు. ఈ డిష్ ని ఆక్సిజన్ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో నిలువ చేస్తూ ఉంటారు. అయితే దీనిని నిల్వ ఉంచడంలో, తినడంలో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం టైఫాయిడ్, హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చి ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ.
కిడ్నీ బీన్స్ : సహజంగా ఎరుపు రంగులో లభించే కిడ్నీ బీన్స్ చాలా విషపూరితమైనవి. నాలుగైదు పచ్చి కిడ్నీ బీన్స్ తింటే ఖచ్చితంగా ఆసుపత్రి పాలు కావాల్సిందే.పచ్చి కిడ్నీ బీన్స్ తినడం కంటే కూడా సగం ఉడికించిన కిడ్నీ బిన్స్ తింటే ఇంకా ప్రమాదకరమని వైద్యులకు హెచ్చరిస్తున్నారు.

వేయించిన బ్రెయిన్ శాండ్‌విచ్ : అమెరికాలో లభించేటటువంటి ఈ శాండ్విచ్ ఆవు లేదా దూడ మెదడు నుంచి తయారు చేసినట్లు చెబుతూ ఉంటారు. ఈ వంటకం అమెరికాలో బాగా ప్రాచుర్యం కూడా చెందింది. కానీ దీనిని తర్వాత నిషేధించారు. ఎందుకంటే దీనిలో ఉండే దుష్ప్రభావాలు మనిషి జీవనానికి హాని చేస్తాయని షేధించడం జరిగింది.
బర్డ్ నెస్ట్ సూప్ : కొన్ని రకాల పక్షులను వంటకంగా తినడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విచిత్రంగా పక్షుల గూడును కూడా సూప్ చేసుకొని తాగుతారు. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైనది మరియు అత్యంత ఖరీదైనది కూడా. ఒక కప్పు బర్డ్ నెట్ సూపు సుమారు $10,000 ఖర్చవుతుందని చెప్తారు. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగిన భారీ నష్టాన్ని ని చవి చూడవలసిందే అని కూడా వైద్యులు సూచిస్తున్నారు.
పచ్చి జీడిపప్పు : జీడిపప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. అందరూ ఫిట్నెస్ కోసం జీడిపప్పును తమ ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. కానీ పచ్చి జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరమని వైద్యులు తెలుపుతున్నారు. దీనిలో ఉండే ఉరుషియోల్ అనే మూలకం మనిషికి ప్రాణాంతకం అని వారు హెచ్చరిస్తున్నారు.
